మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ ఆధ్వర్యంలో డాలస్‌లో భారత దేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకున్నారు. మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళి అర్పించిన ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సముపార్జనలో సర్వస్వం త్యాగం చేసి అసువులు బాసిన సమరయోధులను, మాహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ శుభాష్ చంద్రబోస్, మౌలానా అబ్దుల్ కలాం ఇంత పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు హాజరుకావడం వారి మాతృ దేశభక్తిని చాటుతుందని చెప్పారు. అనంతరం ఒకరికొకరు స్వాతంత్య్ర స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.


ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు రాజీవ్ కామత్, మహేందర్ రావు, రాజేంద్ర వంకావాల, తిరుమల్ రెడ్డి కుంభం, జస్టిన్ వర్గీస్, భారతి మిశ్రా, కళయ్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

















