Namaste NRI

వాషింగ్టన్‌ డీసీలో తానా ఆధ్వర్యంలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో తానా పాఠశాల ఆధ్వర్యంలో  79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని భాను మాగులూరి సమన్వయపరిచారు. భారతదేశ జాతీయ జెండాను, అమెరికా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్య అతిథిలుగా పాల్గొన్న ఆముదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్, మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహనీయుల పోరాటాలు, త్యాగాలను నిరంతరం గుర్తుచేసుకోవాలన్నారు. స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం, సామాజిక న్యాయం అనే పునాదులపై మన రాజ్యాంగాన్ని నిర్మించారన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ముందు వరుసలో భారత్, ఆ తర్వాత అమెరికా నిలుస్తోందన్నారు. తెలుగు భాషకు, తెలుగుజాతికి తానా పాఠశాల చేస్తున్న సేవలను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో యాష్ బొద్దులూరి, రామ్ చౌదరి ఉప్పుటూరి, శ్రావ్య చామంతి, బోనాల రామకృష్ణ, రమేష్ అవిరినేని, గోన మోహనరావు, మేకల సంతోష్ రెడ్డి, బండి సత్యబాబు, నంబూరి చంద్రనాథ్, వనమా లక్ష్మీనారాయణ, చల్లా సుబ్బారావు, వనమా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events