
వాషింగ్ మెషీన్ విషయంలో జరిగిన గొడవ, భారత సంతతికి చెందిన వ్యక్తి హత్యకు దారితీసింది. కుటుంబ సభ్యులు చూస్తుండగానే అతని తల నరికి, కాలితో తన్ని చెత్తకుప్పలో పడేసిన భయానక ఘటన టెక్సాస్ సిటీ డాలస్‌లో చోటుచేసుకున్నది. కర్ణాటకకు చెందిన 50 ఏండ్ల చంద్రమౌళి నాగమల్లయ్య డాలస్ ఓ మోటల్ నిర్వహిస్తున్నారు. అతనితోపాటు భార్య, 18 కుమారుడు కూడా అక్కడే ఉంటున్నారు. యోర్దనిస్ కోబాస్ మార్టిన్జ్ (37) అనే వ్యక్తి అని వద్ద పని చేస్తున్నారు. ఈ క్రమంలో (ఈ నెల 10న) ఓ గదిని శుభ్రం చేస్తున్న సమయంలో విరిగిపోయిన వాషింగ్ మెషీన్ వాడొద్దంటూ కోబాస్‌కు చెప్పాడు. అయితే భాష ఇబ్బంది కావడంతో నేరుగా అతనికి కాకుండా, అక్కడే పనిచేస్తున్న మహిళకు చెప్పి.. కోబాస్‌కు ట్రాన్స్‌లేట్ చేయాలని సూచించాడు. దీంతో ఆగ్రహం వ్యక్తంచేసిన కోబాస్, ఓ కత్తి తీసుకొచ్చి నాగమల్లయ్యపై దాడికి ప్రయత్నించాడు.
















