టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత సంతతికి చెందిన ఆశా శర్మను మైక్రోసాఫ్ట్ గేమింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీఈవోగా నియమించింది. ఆశా శర్మ నియామకాన్ని మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు. గత రెండు సంవత్సరాలుగా ఆశా శర్మ మైక్రోసాఫ్ట్‌లో కోట్లాది మందికి చేరుకునేలా సేవలందచేశారని ఆయన తెలిపారు.

తన నియామకంపై ఆశా శర్మ స్పందిస్తూ తమ ఎక్స్ బాక్స్ ప్రొడక్ట్ అభిమానులు, ఆటగాళ్లపై తన దృష్టిని కేంద్రీకరిస్తానని చెప్పారు. తమ స్టూడియోలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని, రిస్క్‌లు తీసుకొంటామని చెప్పారు. కొత్త మార్కెట్లలో ప్రవేశిస్తామని, ఐకానిక్ ఫ్రాంచైజీల్లో పెట్టుబడులు పెడతామని తెలిపారు.















