Namaste NRI

మిసెస్ యూనివర్స్ టైటిల్ గెలిచిన భారతీయురాలు షెర్రీ సింగ్

అంతర్జాతీయ అందాల పోటీల్లో భారత పతాకం రెపరెపలాడింది. భారత్‌కు చెందిన షెర్రీ సింగ్‌ మిసెస్‌ యూనివర్స్‌ 2025 కిరీటాన్ని దక్కించుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు. ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరిగిన 48వ ఎడిషన్‌ పోటీలో ప్రపంచ వ్యాప్తంగా ఆమె 120 మందితో పోటీ పడి కిరీటాన్ని దక్కించుకున్నారు.తొమ్మిదేండ్ల క్రితం వివాహమై ఒక కుమారుడు ఉన్న షెర్రీ సింగ్‌ విజేతగా నిలిచిన తర్వాత ఈ విజయం కేవలం నా ఒక్కదానిదే కాదు. హద్దులు దాటి కలలు కనే ప్రతి మహిళదీ. బలం, దయ, పట్టుదల మహిళ నిజమైన అందానికి నిదర్శనం అని నేను ప్రపంచానికి చూపాలనుకుంటున్నాను అని పేర్కొన్నారు. తనను విజేతగా ప్రకటించిన తర్వాత ఆమె భారత జెండాను చేతబట్టి తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. చరిత్రాత్మకమైన ఈ విజయం భారత్‌ను గర్వపడేలా చేసిందని మిస్‌ యూనివర్స్‌ పోటీ నిర్వాహకులు ప్రశంసించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events