భారత్‌లో మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రావాలని ఇతర దేశాల్లోకి భారతీయులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఇటివల యూకేలోని లండన్‌లో పెద్ద ఎత్తున కార్ ర్యాలీని చేపట్టారు. నార్త్‌టోల్ట్‌లోని కచ్ పాటి దార్ సమాజ్ కాంప్లెక్స్ నుంచి వెంబ్లీలోని స్వామినారాయణ్ బీఎపీఎస్ టెంపుల్ వరకు ఈ ర్యాలీని కొనసా గించారు. భారతదేశంలో జరగబోయే ఎన్నికలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ కి తమ మద్దతును తెలిపేందుకు ఈ ర్యాలీ చేపట్టినట్లు అక్కడి నిర్వహకులు ప్రకటించారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మళ్లీ గెలిపించాలని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలోని హిందూ దేవాలయంలో ప్రత్యేక హవన్ ని నిర్వహించారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ, యూఎస్ఏ శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ హవన్ కు పెద్ద సంఖ్యలో అక్కడి ప్రజలు హాజరయ్యారు. ఇది కేవలం ఆచారం మాత్రమే కాదని, మెజారిటీ భారతీయులు, ఎన్నారైల కోరికల నెరవేర్పు కోసం సామూహిక ప్రార్థన చేసినట్లు అక్కడి ప్రతినిధులు వెల్లడించారు.