Skip to main content

Namaste NRI

భారతీయులు అక్కడకు వెళ్లొద్దు

ఆఫ్రికా దేశమైన సుడాన్‌ లో గత వారం రోజులుగా ఆ దేశ ఆర్మీ, పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణ జరుగుతున్నది. ఇప్పటి వరకు 300 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. ఈ నేపథ్యంలో సుడాన్‌లో ఉన్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు జారీ చేసింది. రాజధాని ఖార్టూమ్‌లోని భారతీయ రాయబార కార్యాలయం ఫైటింగ్‌ జోన్‌లో ఉన్నట్లు తెలిపింది. ఎంబసీ తెరిచే ఉందని, పని చేస్తున్నదని పేర్కొంది. అయితే ఖార్టూమ్‌ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఉన్న ఇండియన్‌ ఎంబసీ బిల్డింగ్‌ సమీపంలో ఆర్మీ, పారామిలిటరీ దళాల మధ్య భారీస్థాయిలో పోరాటం జరుగుతున్నదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారతీయ రాయబార కార్యాలయంలో సిబ్బంది ఎవరూ లేరని, వారంతా ఇళ్ల నుంచి పని చేస్తున్నారని తెలిపింది. దీంతో రక్షణ, లేదా సహాయం కోసం భారతీయులు ఇండియన్‌ ఎంబసీ వద్దకు వెళ్లవద్దని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. సుడాన్‌లోని భారతీయులు ఇళ్లలోనే ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Social Share Spread Message

Latest News