మనం ఇతర దేశాలకు వెళ్లాలంటే ఆ దేశ అనుమతి (వీసా) తప్పనిసరి. అది లేకపోతే ఆ దేశంలోకి ప్రవేశించడం చట్టరిత్యా నేరం. అయితే కొన్ని దేశాలకు మాత్రం ఈ నిబంధనల్లో సడలింపులు ఉన్నాయి. ఆ దేశ పాస్‌పోర్ట్ ర్యాంక్ ఆధారంగా అందులోని పౌరులు వీసా లేకుండానే ఇతర దేశాలకు ప్రయాణించే వీలు ఉంటుంది. తాజాగా హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ ప్రకారం భారత్ 87వ స్థానం దక్కించుకుంది. దీని ప్రకారం భారతీయులు వీసా అవసరం లేకుండా 67 దేశాలకు ప్రయాణించే వెసులుబాటు ఉంది. ఈ జాబితాలో జపాన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టును కలిగి ఉన్న దేశంగా నిలిచింది. జపాన్ పౌరులు వీసా లేకుండా 193 దేశాలు చుట్టేయవచ్చు. రెండో స్థానంలో సింగపూర్, దక్షిణ కొరియాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ సమాచారం ఆధారంగా హెన్లీ అండ్ పార్టనర్స్ పరిశోధకుల బృందం ప్రతి ఏటా ఈ జాబితాను రూపొందిస్తుంది.














