
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ జోక్యం చేసుకుంటోందని దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ పరోక్షంగా ఆరోపించారు. ఇదిలాగే కొనసాగితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిం చారు. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష రేసులో ఉన్న ట్రంప్‌నకు సంబంధించి ఎలాంటి సమాచారం వస్తుందో చూడండంటూ కొన్ని స్క్రీన్‌షాట్లు షేర్ చేశారు. ట్రంప్‌పై ఏమైనా నిషేధం విధించారా అని ప్రశ్నించారు. గూగుల్ సెర్చ్‌లో ప్రెసిడెంట్ డొనాల్డ్ అని టైప్ చేయగా సజెషన్స్‌లో ప్రెసిడెంట్ డొనాల్డ్ డక్, ప్రెసిడెంట్ డొనాల్డ్ రీగన్ (వాస్తవానికి అది రొనాల్డ్ రీగన్) అని వస్తున్నట్లు ఉన్న స్క్రీన్‌షాట్‌ను మస్క్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. దీన్ని హైలైట్ చేస్తూ ట్రంప్‌పై సెర్చ్ చేయడాన్ని నిషేధించారా అని ప్రశ్నించారు. ఇది ఎన్నిక ల్లో జోక్యం చేసుకోవడం కాదా అని నిలదీశారు.
