నటుడు, రచయిత బాసంగి సురేష్ రచించిన కవితా చిత్రమ్ పుస్కకావిష్కరణ. బాసంగి సురేష్ ప్రధానపాత్రలో నటించిన మట్టి మనిషి చిత్రం ప్రివ్యూను రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నటుడు, రచయిత, దర్శకుడు హర్షవర్ధన్, గౌరవ అతిథిగా పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ కవితా చిత్రమ్ పుస్తకావిష్కరణ, మట్టి మనిషి చిత్రం ప్రివ్యూలో నటుడు, రచయిత హర్షవర్దన్ చేతులమీదుగా జరిగింది. ఈ సందర్భంగా హర్షవర్దన్ మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ చింతల వెంకటరెడ్డి ఒక శాస్త్రజ్ఞుడని, నిరుత్సాహపడుతున్న రైతులకు ఆయన స్ఫూర్తి అని కొనియాడాడు. వెంకటరెడ్డి స్ఫూర్తితో తీసిన మట్టి మనిషి డెమో ఫిల్మ్ బాగుంది. ఆయన బయోపిక్ కూడా రావాలని కోరుకుంటున్నాను అన్నారు. ఆవ సినీ గీత రచయిత తుంబలి శివాజీ, సినీ దర్శకుడు ఎస్‌ఎస్ పట్నాయక్, కర్రి బాలాజీ, కాళీచరణ్, మదుసూదనరావు, సంగీత దర్శకుడు సాహిణి శ్రీనివాస్, మట్టి మనిషి చిత్రం దర్శకుడు విరాజ్ పద్మ, నటులు నవీన్, హరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.














