ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి తయారీ కేంద్రాలే లక్షంగా చేసుకుని ఇ ఇజ్రాయెల్, అమెరికా ప్రతీకార దాడులకు పాల్పడటంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తీవ్రంగా ప్రతిస్పందించారు. తమ దేశంతోపాటు మిత్ర పక్షాలపై దాడులకు దిగితే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని ఇజ్రాయెల్, అమెరికాలను హెచ్చరించారు. అక్టోబర్ 26న తమ మిలిటరీ స్థావరాలు, తదితర ముఖ్యమైన ప్రాంతాలను లక్షంగా చేసుకుని చేసిన దాడులకు ఐదుగురు బలయ్యారని, ఇప్పుడు మరోసారి దాడులు చేయడానికి ఇజ్రాయెల్, అమెరికా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఖమేనీ మండిపడ్డారు. ఏవైపు నుంచి తదుపరి దాడులు జరిగినా విస్తృత మధ్యప్రాచ్యాన్ని చుట్టుముడుతుందని హెచ్చరించారు.