విదేశాల్లో ఉంటున్న తమ దేశ పౌరులకు ఇరాన్ కీలక హెచ్చరిక జారీ చేసింది. తమ శతృవులకు మద్దతుగా నిలిస్తే ఇరాన్‌లోని వారి ఆస్తులను సీజ్ చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ అటార్నీ జనరల్ కార్యాలయం ఒక ప్రకటన చేసింది. విదేశాల్లో ఉంటున్న ఇరాన్ పౌరులు ఆ దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించకూడదు. శతృవులకు సహకరించడం, మద్దతు తెలపడం వంటివి చేయకూడదు. ముఖ్యంగా ఇజ్రాయెల్, అమెరికాలకు అనుకూలంగా ఉండకూడదు.

ఒకవేళ అలా చేస్తే ఇరాన్‌లోని వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటారు. శతృవుల చర్యలను సమర్ధించినా, సహకరించినా ఇదే అమలవుతుంది. చట్ట ప్రకారం వారి ఆస్తులను సీజ్ చేస్తామని తెలిపింది. ఇరాన్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే వారిని శతృవులు కింద పరిగణించి, వారి ఆస్తులను జప్తు చేసే అధికారం తమకు ఉందని వెల్లడించింది. ఇంటెలిజెన్స్, గూఢచర్యం వంటి వాటికి పాల్పడినా ఇదే గతి పడుతుందని హెచ్చరించింది. ఇజ్రాయెల్, అమెరికా ప్రభుత్వాలతో కలిసి పని చేయకూడదని కూడా సూచించింది.















