Skip to main content

Namaste NRI

విమాన ప్రయాణికులకు శుభవార్త

విమాన ప్రయాణికులకు శుభవార్త. ఏప్రిల్‌ 20 నుంచి అన్ని విమానాల్లో 60 శాతం సీట్లపై ఎలాంటి అదనపు చార్జీలు వసూలు చేయరాదని అన్ని విమానయాన సంస్థలకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఆదేశించింది. ఈ మేరకు ఎయిర్‌లైన్స్‌కు ఉత్తర్వులు జారీచేసింది. ఇవి ఏప్రిల్‌ 20 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.

విమానాల్లో కనీసం 60 శాతం సీట్లను ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా కేటాయించాలని ఈ నెల 18న డీజీసీఏకు పౌర విమానయాన శాఖ సూచించింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 20న డీజీసీఏ విమానయాన సంస్థలకు సవరించిన ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సర్క్యులర్‌ను జారీచేసింది. అలాగే ఒకే పీఎన్‌ఆర్‌పై ప్రయాణించే వారికి సాధ్యమైనంత వరకు పక్క పక్క సీట్లను కేటాయించాలని విమానయాన సంస్థలకు డీజీసీఏ సూచించింది.

Social Share Spread Message

Latest News