ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ తీవ్రరూపం దాలుస్తున్న దృష్ట్యా ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ బేషరతుగా లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించిన విషయం తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యలపై ఖమేనీ తాజాగా స్పందించారు. లొంగిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు అమెరికా సైనిక జోక్యం వల్ల కోలుకోలేని నష్టం జరుగుతుందని హెచ్చరించారు.

ఇరాన్ దేశ చరిత్ర తెలిసిన తెలివైన వ్యక్తులు ఈ దేశంతో ఎప్పుడూ బెదిరింపు ధోరణితో మాట్లాడరు. ఎందుకంటే ఇరాన్ దేశం ఎన్నటికీ లొంగిపోదు. అమెరికా సైనిక జోక్యం చేసుకుంటే, నిస్సందేహంగా కోలుకోలేని నష్టం ఉంటుందన్న విషయాన్ని అమెరికన్లు తెలుసుకోవాలి అని సుప్రీం లీడర్ హెచ్చరించారు.
