ఇరాన్ తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒమన్ రాజధాని మస్కట్ లో జరిగిన పరోక్ష సమావేశంలో చర్చలు కొనసాగించాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. దాంతో ఈ విషయంలో తొలి అడుగు పడింది.

అయితే అణుఒప్పందానికి సంబంధించి అమెరికా నుంచి వచ్చిన తొలి ప్రతిపాదనపై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ విమర్శలు చేశారు. యూఎస్ ప్రతిపాదన తమ చర్యలకు పూర్తి వ్యతిరేకంగా ఉందని వ్యాఖ్యానించారు. దేశంలో 100 న్యూక్లియర్ పవర్‌ప్లాంట్లు ఉన్నా దేశం సుసంపన్నం కాకుంటే అవి ఉపయోగపడవని, మళ్లీ నిధుల కోసం అమెరికా ముందు చేయిచాచాల్సి వస్తుందని అన్నారు. అయితే అమెరికాతో అణు ఒప్పందాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు మాత్రం ఖమేనీ పేర్కొనలేదు. అణు ఒప్పందంపై చర్చలు జరుగుతున్నప్పటికీ యూఎస్ ప్రతిపాదన గురించి మాత్రం ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.
