విశ్వక్‌సేన్ హీరోగా నటించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. అంజలి, నేహాశెట్టి కథానాయికలు. కృష్ణచైతన్య దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మాతలు. ఈ శుక్రవారం సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా కథానాయకుడు విశ్వక్‌సేన్ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులకు సినిమాలంటే ఇష్టం. సినిమాల ను బాగా ప్రేమిస్తారు. పలు కారణాల వల్ల థియేటర్లు మూసేస్తున్న పరిస్థితి నెలకొనివుంది. అలాంటి పరిస్థితు ల్లో ఒక సినిమా వల్ల జనాలు థియేటర్లకు వస్తున్నారంటే ఆనందం పడాల్సిన విషయం. ఏదిఏమైనా నా సినిమాల వల్ల థియేటర్లకు కళ రావడం సంతోషంగా ఉంది అని అన్నారు.

కృష్ణచైతన్య మాట్లాడుతూ జనాల్లో స్పందన బావుంది. ఆడపిల్లలకు సెకండాఫ్ బాగా నచ్చింది. డిస్ట్రిబ్యూటర్లు ఫోన్లు చేసి రెవెన్యూలు చెబుతుంటే చాలా ఆనందం అనిపించింది. బాలకృష్ణగారు ఫోన్ చేసి శుభాశీస్సులు అందించారు. ఈ సినిమాకు సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది. కథ రెడీ చేసే పనిలో ఉన్నాను. అది సీక్వెలా? లేక ప్రీక్వెలా? అనేది త్వరలో చెబుతా. రాజీపడకుండా ఇంత మంచి సినిమా తీయడానికి సహకరించిన నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా అన్నారు.
