యష్ పూరీ, అపూర్వ రావు జంటగా నటిస్తున్న చిత్రం హ్యాపీ ఎండింగ్. కౌశిక్ భీమిడి దర్శకుడు. సిల్లీ మాంక్స్, హామ్స్ టెక్ సంస్థలు నిర్మించాయి. ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ శాపాల నేపథ్యంలో నడిచే వినోదాత్మక చిత్రమిది. మన పురాణాల్లో శాపాలకు సంబంధించిన అనేక కథలు కనిపిస్తాయి. నేటి తరంలో ఓ అబ్బాయి శాపం బారిన పడితే ఏం జరిగిందన్నదే ఈ సినిమా కథాంశం. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఆద్యంతం ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది అన్నారు. ఓ పిల్లవాడు వ్యక్తిగా మారే వినూత్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, నేటి తరం వారికి బాగా కనెక్ట్ అవుతుందని హీరో యష్ తెలిపారు. నిర్మాత అనిల్ పల్లాల మాట్లాడుతూ నూతన ప్రతిభను ప్రోత్సహిస్తూ మా బ్యానర్‌పై సినిమాలు తీస్తున్నాం. హ్యాపీ ఎండింగ్ టైటిల్ మాదిరిగానే అందరికి సంతోషాలను పంచే చిత్రమవుతుంది అన్నారు. ఈ చిత్రం త్వరలో విడుదలకానుంది.


