రామ్‌కిరణ్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం సకుటుంబానాం. ఉదయ్‌శర్మ దర్శకుడు. మహాదేవ గౌడ, నాగరత్న నిర్మాతలు. ఈ సినిమా తాలూకు ఓ గీతాన్ని విడుదల చేశారు. అది దా సారు అంటూ సాగే ఈ గీతానికి మణిశర్మ స్వరాల్ని అందించగా అనంత్‌శ్రీరామ్ రచించారు. రొమాంటిక్ గీతమిదని, నాయకానాయికల మధ్య కెమిస్ట్రీ హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు. చక్కటి వినోదంతో కుటుంబ కథగా మెప్పిస్తుందని దర్శకుడు పేర్కొన్నారు. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, సత్య, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్నారు.