డైరెక్టర్ నితేష్ తివారీ నాలో సీతమ్మని చూశారనే ఫీలింగ్ చాలాబావుంది. నిజంగా ఇది అరుదుగా దొరికే అదృష్టం అంటూ ఆనందం వ్యక్తం చేసింది అందాలభామ సాయిపల్లవి. త్వరలోనే వెండితెరపై ఆమె మహాసాద్వి సీతగా కనిపించనున్న విషయం తెలిసిందే. తనకు ఈ పాత్ర దొరకడంపట్ల సాయిపల్లవి చెన్నయ్‌లోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆనందం వ్యక్తం చేసింది. ఎప్పడెప్పుడు షూటింగ్‌కి పిలుస్తారా అని ఎదురుచూస్తున్నాను. ఇది నాకో ఛాలెంజ్. ఎందుకంటే లెజెండ్రీ ఆర్టీస్టులు చేసిన పాత్ర అది. వారు చేసిన దాంట్లో టెన్ పర్సంట్ చేసినా బాగా చేసినట్టే. త్వరలోనే కథ వినడానికి ముంబాయ్ వెళ్లబోతున్నాను. రామాయణం అందరికీ తెలిసిందే. అయితే నితేశ్ రామాయణాన్ని వినడానికి ఆతృతగా ఉన్నా.ఇండియన్ స్క్రీన్‌పై చాలా రామాయణాలు వచ్చాయి. కానీ వాల్మీకి రామాయణాన్ని ఎవరూ పరిపూర్ణంగా చెప్పలేదు. ఈ సినిమా ఆ లోటును తీరుస్తుందనే ఆశతో ఉన్నాను. మరోసారి నితేశ్గారికి థాంక్స్. నాలో సీతమ్మని చూసినందుకు అంటూ సంతోషం వ్యక్తం చేసింది.
