ముఖ్యమంత్రి లాంటి ఉన్నత పదవిలో ఉంటూ వ్యక్తిగతంగా దూషణలు చేయడం మంచి పద్ధతి కాదని బీఆర్‌ఎస్ సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు గుర్రాల నాగరాజు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పదించారు. ప్రస్తుత యువతరం రాజకీయ నాయకులను, వారి నడవడికను పరిశీలిస్తారన్నారు. రాజకీయాలు చేస్తూ ప్రజలకు ఉపయోగ పడే పనులు చేస్తూ మన్నన పొందాలని, అంతే గాని గల్లీ నాయకులు మాట్లాడే విధంగా దిగజారొద్దు అని హితవు పలికారు. పదేండ్లపాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నేతపై నోటికొచ్చినట్టు మాట్లాడ టం మంచిది కాదు అన్నారు.
