శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం సామజవరగమన. రెబా మోనికా కథానాయిక. రామ్ అబ్బరాజు దర్శకుడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. తాజాగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. ప్రేమ, వినోదం అంశాలతో అందరిని ఆకట్టుకుంటుంది. ప్రేమ ప్రయాణంలోని మధుర జ్ఞాపకాలకు అద్దం పడుతుంది. శ్రీవిష్ణు పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. గోపీ సుందర్ సంగీతం ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది అని చిత్రబృందం పేర్కొంది. నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు.
ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. తాజాగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ సినిమాను జూన్ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాంరెడ్డి, కథ: భాను భోగవరపు, సంభాషణలు: నందు సవిరిగాన, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్ అబ్బరాజు.