చాట్బాల్లు కేవలం 18 నెలల వ్యవధిలో పిల్లలకు చదవడం, రాయడం నేర్పుతాయని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ తెలిపారు. శాన్ డియాగోలో జరిగిన ఎఎస్యూ+ జీఎస్వీ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృతిమ మేధ గురించి ప్రస్తావించారు. నానాటికి కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యం పెరుగుతోంది. ఇది భవిష్యత్తులో మరింత విస్తరిస్తుంది. చాట్బాట్లు కేవలం 18 నెలల వ్వవధిలో పిల్లలకు చదవడం, రాయడం వంటి నైపుణ్యాలను చక్కగా అందించగలుగుతాయి. కంప్యూటర్లు రాయడం నేర్పించలేవు. చాట్బాట్లు అలా కాదు. మనం ఇచ్చే దాన్ని గుర్తించి దానిలో మార్పు చేసుకోగల సామర్థ్యం ఉంటుంది. మానవుల వలే చక్కగా బోధించగలవు. వారి కంటే మెరుగ్గా కూడా నేర్పించగలవు అని అన్నారు.
