జీవన్ రెడ్డి, అలేఖ్య జంటగా నటిస్తున్న చిత్రం వృషభ. అశ్విన్ కామరాజ్ కొప్పాల దర్శకత్వం. ఈ చిత్రాన్ని ఉమాశంకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్, లిరికల్ వీడియోను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ఇదొక విభిన్నమైన ప్రేమకథ. నాలుగేళ్ల పాటు స్క్రిప్ట్‌పై వర్క్ చేశాం. ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది అన్నారు.
చిత్రీకరణ తుదిదశలో ఉందని, ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని నిర్మాత ఉమాశంకర్ రెడ్డి తెలిపారు. ట్రైలర్ చూడగానే ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ అనే భావన కలిగిందని కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన దర్శకుడు సముద్ర పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: యు.ఎస్.విజయ్, సంగీతం: ఎమ్.ఎల్.రాజా, సహనిర్మాత: మల్లికా రెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశ్విన్ కామరాజ్ కొప్పాల.