ఖతార్‌లో ఓ ప్రవాసుడికి తాజాగా నిర్వహించిన అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో జాక్‌పాట్ తగిలింది. నేపాల్‌కు చెందిన ప్రవాసుడు రంజిత్ కుమార్ పాల్ గత నెల 16వ తేదీన 248 సిరీస్‌లో కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కే ఈ జాక్‌పాట్ తగిలింది. ఖతార్ రాజధాని దోహాలో ఉండే రంజిత్ ఆన్‌లైన్‌లో కొన్న టికెట్ నం.232936 అతనికి ఇలా అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. రాఫెల్ డ్రాలో విజేతగా నిలిచిన అతడు ఏకంగా 23 మిలియన్ల దిర్హమ్స్ (రూ.51.65కోట్లు) గెలుచుకున్నాడు.
దోహాలో గత ఏడేళ్లుగా నివాసం ఉంటున్న రంజిత్ 15 నెలల నుంచి క్రమం తప్పకుండా బిగ్ టికెట్లో పాల్గొంటున్నాడు. ఇద్దరు పిల్లల తండ్రి అయిన రంజిత్ స్థానికంగా ఉండే ఓ మనీ ఎక్స్ంఛేజ్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇంత భారీ మొత్తం గెలుస్తానని కలలో కూడా ఊహించలేదు. ఇది మా జీవితాన్నే మార్చివేసే అద్భుత సంఘటన. ఈ నగదుతో స్వదేశానికి వెళ్లి పర్మినెంట్గా అక్కడే సెటిల్ అవుతా అని రంజిత్ చెప్పాడు.














