Namaste NRI

ప్రవాస భారతీయుడికి జాక్‌పాట్

యూఏఈలో ఉంటున్న ప్రవాస భారతీయుడు మహమ్మద్ కు  జాక్‌పాట్  తగిలింది. స్వదేశంలో ఉపాధి కరువై కొన్నేళ్ల క్రితం మహమ్మద్ యూఏఈ వెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో గత కొంతకాలంగా మహజూజ్ డ్రాలో పాల్గొంటున్నాడు. తాజాగా నిర్వహించిన డ్రాలో మహమ్మద్‌‌కు ఏకంగా 1లక్ష దిర్హమ్స్ (రూ.22.50లక్షలు) జాక్‌పాట్ తగిలింది. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేవు. ఇన్నాళ్లు తనకు వచ్చే జీతంలో తన ఖర్చులకు పోగా, మిగిలినవి ఇంటికి పంపించడంతో అక్కడిది అక్కడే సరిపోయేది. దాంతో నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వ లేకుండా పోయేదని వాపోయాడు. దాంతో తన స్నేహితుల సలహా మేరకు కొన్ని నెలల నుంచి మహజూజ్ డ్రాలో పాల్గొంటున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలో గత వారం నిర్వహించిన డ్రాలో రూ.22.50లక్షలు గెలుచుకున్నట్లు తెలిపాడు. ఇన్నాళ్లు పెళ్లి చేసుకుంటే మిగతా ఖర్చులకు ఎలా అని ఆలోచించివాడినని, ఇప్పుడు తాను గెలుచుకున్న డబ్బుతో ఆ లోటు ఉండదని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు హ్యాపీ పెళ్లి చేసుకోవచ్చని మహమ్మద్ మురిసిపోతున్నాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events