Namaste NRI

లండన్‌లో ఘనంగా జగదీశ్‌ రెడ్డి జన్మదిన వేడుకలు

లండన్‌లో  బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి జన్మదిన వేడుకలను ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు.  ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే ఉపాధ్యక్షుడు గొట్టెముక్కల సతీశ్‌ రెడ్డి అధ్యక్షతన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జై జగదీశ్‌ అన్న, లాంగ్‌ లివ్‌ జగదీశ్‌ అన్న అంటూ నినాదాలు చేశారు.అనంతరం ఎన్నారై బీఆర్‌ఎస్‌ యూకే అధ్యక్షుడు నవీన్‌ రెడ్డి మాట్లాడుతూ జగదీశ్‌ రెడ్డి నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజలకు ఆయన మరింత సేవలు చేయాలన్నారు. అధికార ప్రతినిధి రవి ప్రదీప్ గౌడ్ పులుసు మాట్లాడుతూ సూర్యాపేట రూపురేఖలను మార్చిన ఘనత జగదీశ్‌ రెడ్డికే దక్కుతుందని అన్నారు.

ఉపాధ్యక్షులు రవి కుమార్ రేటినేని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నిరంతర విద్యుత్‌ అందించడానికి విద్యుత్‌ శాఖ మంత్రిగా జగదీశ్‌ రెడ్డి చేసిన కృషిని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగు, తాగు నీరు అందించడంలో ఆయన పాత్రను కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల,  సత్య చిలుముల, హరి గౌడ్ నవాబుపేట, రవి ప్రదీప్ పులుసు, సత్యపాల్ రెడ్డి పింగళి, తరుణ్ లూనావత్, అబూ జాఫర్, పవన్ కళ్యాణ్, అజయ్ రావు, యూకేలోని వివిధ ప్రాంతాల్లోని జగదీశ్‌ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు

Social Share Spread Message

Latest News