తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం జైలర్. మిల్కీ బ్యూటీ తమన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ కామెడీ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న జైలర్ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, టాలీవుడ్ యాక్టర్ సునీల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, రమ్యకృష్ణ, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి కావాలయ్యా సాంగ్ ఇప్పటికే నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. తాజాగా తెలుగు వెర్షన్ కావాలయ్యా సాంగ్‌ను లాంఛ్ చేశారు మేకర్స్. శ్రీ సాయి కిరణ్ రాసిన ఈ పాటను సింధూజ శ్రీనివాసన్, అనిరుధ్ రవిచందర్ పాడారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 10న విడుదల కానుంది.