బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీకపూర్ పుట్టినరోజు సందర్భంగా దేవర టీమ్ జాన్వీకి బర్త్‌డే విషెస్ తెలిపింది. ఈ సందర్భంగా దేవర మూవీ నుంచి జాన్వీ కపూర్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం దేవర. ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రాను న్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిభాగం 2024 అక్టోబర్ 10న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి తారక్ లుక్‌తో పాటు, సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ లుక్‌లను రిలీజ్ చేయగా, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
