Namaste NRI

రామ్‌ చరణ్‌తో జోడీగా…జాన్వీకపూర్‌  

బాలీవుడ్‌లో అనతికాలంలోనే అగ్ర నాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది జాన్వీకపూర్‌. తెలుగులో కూడా ఈ భామకు వరుసగా భారీ అవకాశాలు వరిస్తున్నాయి. తెలుగులో మరో అగ్ర హీరో రామ్‌చరణ్‌తో జోడీకట్టబోతున్న ది. ఉప్పెన ఫేమ్‌ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్‌చరణ్‌ పాన్‌ ఇండియా చిత్రంలో నటించబోతున్న విషయం తెలిసిందే.  ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో జాన్వీకపూర్‌ నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. జాన్వీకపూర్‌ పుట్టిన రోజును పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబం ధించిన పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్‌ సమర్పిస్తున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events