Namaste NRI

జాన్వీ కపూర్ బర్త్ డే గిఫ్ట్ – రామ్ చరణ్ ఆర్‌సీ 16 నుంచి పోస్టర్

రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తున్న ఆర్‌సీ16లో కూడా జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌. అయితే ఈ రోజు జాన్వీ క‌పూర్ పుట్టిన రోజు (మార్చి 6) కాగా, నేడు ఈ అమ్మ‌డు 28వ వ‌సంతంలోకి అడుగుపెట్టింది. ఈ క్ర‌మంలో అభిమానులు, సెల‌బ్రిటీలు జాన్వీక‌పూర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తున్నారు. అలానే ఆర్‌సీ 16 చిత్ర బృందం కూడా జాన్వీకి వెరైటీగా విషెస్ తెలియ‌జేసింది. మూవీలోని ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఇందులో జాన్వీక‌పూర్ కుడి చేత్తో మేక‌పిల్ల‌ను ఎత్తుకోగా, ఎడ‌మ చేత్తో గ‌డ్డి మొక్క‌ను ప‌ట్టుకుని చిరున‌వ్వులు చిందిస్తూ వెళుతుంది.

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆర్‌సీ 16 కాగా, ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. బుచ్చిబాబు, చరణ్ కోసం ఓ పవర్‌ఫుల్ కథను సిద్ధం చేసిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. రూరల్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కొత్త అవతారం లో కనిపించి ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్ ఇవ్వ‌నున్నాడు. ఈ చిత్రంలో జ‌గ‌ప‌తి బాబు ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్ర‌హీత ఏఆర్ రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Social Share Spread Message

Latest News