జపాన్‌తో భారీ వాణిజ్య ఒప్పందం జరిగినట్లు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో జపాన్ ప్రధాని షిగేరు ఇసిబా స్పందించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రకటనను ఆహ్వానిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఫిలిప్పీన్స్‌తో జరిగిన వాణిజ్య ఒప్పందాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. జపాన్ టారిఫ్ రేట్‌ను 15 శాతానికే ఫిక్స్ చేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న దేశాల్లో ఈ రేట్ అత్యంత కనిష్టమైంది. జపాన్ వాహనాలపై విధిస్తున్న రేట్‌ను 25 శాతానికి పెంచాలనుకున్నారు, కానీ దాన్ని 15 శాతానికే కుదించినట్లు జపాన్ ప్రధాని ఇషిబా తెలిపారు.

జపనీస్ వైపు పన్ను శాతం తగ్గినట్లు ఎటువంటి ప్రకటన జరగలేదు. బలమైన రీతిలో లాబీయింగ్ చేయడం వల్లే అమెరికా తమపై పన్నులను భారీగా వసూల్ చేయడం లేదని జపాన్ ప్రధాని వెల్లడించారు. చరిత్రలో అతిపెద్ద వాణిజ్యం ఒప్పందం కుదిరినట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. జపాన్‌తో జరిగిన అతిపెద్ద డీల్ ఇదే అని ఆయన వెల్లడించారు. అమెరికాలో సుమారు 550 బిలియన్ల డాలర్లు ఇన్వెస్ట్ చేయడానికి జపాన్ సిద్ధంగా ఉంది. అలాగే 15 శాతం దిగుమతి సుంకాన్ని కూడా చెల్లించేందుకు జపాన్ అంగీకరించింది.
















