Namaste NRI

జిన్నా నుంచి జారు మిటాయా లిరికల్ సాంగ్

విష్ణు కథానాయకుడిగా సూర్య తెరకెక్కించిన చిత్రం జిన్నా. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు నిర్మించాయి. సన్నీ లియోన్, పాయల్ రాజ్పుత్ కథానాయికలు. ఈ సినిమా అక్టోబరు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలోని జారు మిఠాయి పాటను విడుదల చేశారు. విష్ణ్ణు, సన్నీ లియోన్లపై చిత్రీకరించిన మాస్ గీతమిది. దీనికి అనూప్ స్వరాలు సమకూర్చగా, ఎ.గణేష్ సాహిత్యమందించారు. సింహ, నిర్మల రాథోడ్ ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ నృత్యరీతులు సమకూర్చారు. ఈ మూవీలో విష్ణు టెంట్ హౌస్ యజమాని జిన్నా పాత్రలో నటిస్తున్నాడు. సన్నీలియోన్ మోడ్రన్ యువతి రోల్లో కనిపించనుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్లో కథాంశంతో సాగే ఈ సినిమాకు కోన వెంకట్ కథ, స్క్రీన్ప్లే అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్టు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News