Namaste NRI

జేడీ చక్రవర్తి చేతుల మీదుగా ఓ.. చెలియా నుంచి నా కోసం ఆ వెన్నెల సాంగ్ రిలీజ్

నాగ ప్రణవ్‌, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ప్రేమకథాచిత్రం ఓ చెలియా. ఎం.నాగరాజశేఖర్‌రెడ్డి దర్శకుడు. రూపాశ్రీ కొపురు నిర్మాత. నిర్మాణంలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానున్నది. ఈ సినిమా ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తున్నదని మేకర్స్‌ చెబుతున్నారు. విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి ఈ పాటను విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.

నా కోసం ఆ వెన్నెల  అంటూ సాగే ఈ ప్రేమగీతానికి శివ సాహిత్యం అందించగా, ఎం.ఎం.కుమార్‌ స్వరపరిచారు. మేఘన, మనోజ్‌ కలిసి ఆలపించారు. హీరోహీరోయిన్ల ప్రేమను ఆవిష్కరించేలా ఈ పాట సాగింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించనున్నారు. అజయ్‌ఘోష్‌, భోగిరెడ్డి శ్రీనివాస్‌, సారిపల్లి సతీశ్‌, యశోద ఆర్‌.కొలిశెట్టి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలోని ఓ ప్రేమగీతాన్ని మేకర్స్‌ విడుదల చేశారు. ఈ చిత్రానికి కెమెరా: సురేశ్‌ బాలా, నిర్మాణం: ఎస్‌ఆర్‌ఎస్‌ మూవీ క్రియేషన్స్‌, ఇందిరాదేవి ప్రొడక్షన్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events