
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. తొలిరోజు ఢిల్లీలోని అక్షర్‌ధామ్ ఆలయాన్ని సందర్శించారు. ప్రధాని మోదీతో జేడీ వాన్స్ దంపతులు భేటీ అయ్యారు. రెండోరోజైన జేడీ వాన్స్ తన భార్య ఉషా వాన్స్, ముగ్గురు పిల్లలతో కలిసి జైపూర్ సందర్శనకు వెళ్లారు. అక్కడ అంబర్ ఫోర్ట్ ను సందర్శించారు. ఆ కోట విశేషాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
