Skip to main content

Namaste NRI

జేడీ వాన్స్‌ కీలక ప్రకటన … ఉషా వాన్స్‌తో కలిసి

అమెరికా అధ్యక్ష కార్యవర్గంలోని కీలక అధికారులు, సెకండ్‌ లేడీ ఉషా వాన్స్‌ తమ దేశంలో అనధికారిక పర్యటనకు రానుండటాన్ని గ్రీన్‌లాండ్‌ ఇటీవల తపుపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూఎస్‌ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కీలక ప్రకటన చేశారు. తన సతీమణి ఉషా వాన్స్‌తో కలిసి గ్రీన్‌లాండ్‌ పర్యటనకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.  ప్రపంచ భద్రత ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు.  తమ అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌ గ్రీన్‌లాండ్‌ ప్రజల భద్రతను పునరుజ్జీవింపజేయాలనుకుంటున్నారని, అందులో భాగంగానే అక్కడి పరిస్థితులను సమీక్షించడానికి వెళ్తున్నట్లు తెలిపారు.  గ్రీన్‌లాండ్‌ వాయువ్య తీరంలో ఉన్న స్పేస్‌ ఫోర్స్‌ అవుట్‌పోస్ట్‌, సైనిక స్థావరాలను సందర్శిస్తామన్నారు. ప్రపంచదేశాల భద్రతను కాపాడటం ముఖ్యమని తాము భావిస్తున్నందున ఈ పర్యటనకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News