అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తన కాబోయే భార్య లారెన్ శాంచెజ్ కు ఖరీదైన కానుకలను ఇచ్చి సంతోష పెట్టే కార్యక్రమంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. అమెరికా ఫ్లోరిడా లోని ఇండియన్ క్రీక్ ఐలాండ్‌లో 68 మిలియన్ డాలర్ల (రూ.560 కోట్లు) త్రీ బెడ్ రూమ్ మాన్షన్‌ను కొనుగోలు చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. 2.8 ఎకరాల విస్తీర్ణంలో 1965లో ఈ ఇంటిని నిర్మించారు. ఎంటీఎం స్టార్ ఇంటర్నేషనల్ కార్ప్ మాజీ మేనేజర్టులియా నుంచి జెఫ్బెజోజ్ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇండియన్ క్రీక్‌ను అక్కడ బిలియనీర్ బంకర్ అని కూడా పిలుస్తారట. కార్ల్ ఇకాన్, టామ్ బ్రాడీ, ఇవాంకా ట్రంప్, జారెడ్ కుష్నర్ వంటి ప్రముఖులు కూడా ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్నారని తెలిసింది. దీన్ని 1965లో నిర్మించారు. క్రీక్ ఐల్యాండ్ అని పిలిచే ఇది చిన్న దీవి. ఇక్కడి జనాభా కేవలం 81 మంది అని 2021 జనాభా లెక్కల ఆధారంగా తెలుస్తోంది.