Skip to main content

Namaste NRI

భారతీయ విద్యార్థులకు యూకేలో జాబ్‌ ఈజీ

బ్రిటన్‌, భారత్‌ అధికారుల మధ్య అవగాహనా ఒప్పందం(ఎంవోయూ) కుదరనుంది. దీని ప్రకారం ఇండియన్‌ సెకండరీ స్కూల్‌ లేదా ప్రీ`యూనివర్సిటీ సర్టిఫికెట్‌ సంపాదించుకున్న భారతీయ విద్యార్థులు బ్రిటన్‌లోని ఉన్నత విద్యా కోర్సుల్లో చేరడానికి అర్హులే. భారత్‌లోనూ, బ్రిటన్‌లోనూ బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, డాక్టోరల్‌ డిగ్రీ రెండు దేశాల్లో సమానంగా పరిగణిస్తారు. మెడిసిన్‌, ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్‌, ఫార్మసీ వంటి ప్రొఫెషనల్‌ కోర్సులను ఈ ఎంవోయూ నుంచి మినహాయిచారని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి బీవీఆర్‌ సుబ్రమణ్యం తెలిపారు.  రెండు దేశాల మధ్య ఉచిత వాణిజ్య ఒప్పందం కింద గుర్తింపు కోసం చర్చలు జరుపుతుందన్నారు. వచ్చే నెల 31 నాటికి చర్చలు ముగిసి, దీపావళికల్లా ఇరు దేశాలు ఒప్పందంపై సంతకాలు చేస్తాయని భావిస్తున్నారు.

                బ్రిటన్‌లోని డిగ్రీ కోర్సులు ఇప్పటి నుంచి భారత్‌ డిగ్రీ కోర్సులతో సమానంగా పరిగణిస్తారు. మీరు ఏదైనా కోర్సులో డిగ్రీ పూర్తి చేస్తే బ్రటన్‌లో ఉద్యోగానికి అర్హులు. ఇది పూర్తిగా గ్రాడ్యుయేట్లకు మాత్రమే వర్తిస్తుందని సుబ్రమణ్యం తెలిపారు. భారత్‌లో చదివే బీఏ, ఎంఏ, బీఎస్సీ, ఎంఎస్సీ కోర్సులు బ్రిటన్‌లో సమానంగా పరిగణిస్తారు. ఆన్‌లైన్‌ కోర్సుల్లో పొందే డిగ్రీలకు ఈ ఎంవోయూ వర్తిస్తుందన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events