సోషల్ మీడియా దిగ్గజాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్లపై తప్పుడు సమాచారం ప్రజలను చంపేస్తోంది అంటూ సోషల్ మీడియాపై సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ద్వారా ఫేక్ న్యూస్ విస్తరించడంపై వైట్‌హౌస్ తీవ్ర వ్యాఖ్యల అనంతరం బైడెన్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మనం గుర్తించలేని ఏకైక మహమ్మారి వారిలోనే ఉందని, వ్యాక్సిన్లపై తప్పుడు సమాచారంతోనే చాలామంది టీకాలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదనీ, వీరితోనే అసలైన ముప్పు పొంచి ఉందని బైడెన్ పేర్కొన్నారు. కరోనా వైరస్, టీకాల గురించి సోషల్ మీడియా తప్పుడు సమాచారం ప్రజలను చంపేస్తోందని వ్యాఖ్యానించారు.