రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న నిర్ణయం ఒక గేమ్ ఛేంజర్ అని ఉక్రెయిన్ వ్యాఖ్యానించింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో జో బైడెన్ తీసుకున్న నిర్ణయం యుద్ధంలో గేమ్‌ఛేంజర్ గా మారే అవకాశం ఉందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిగా చెప్పారు. రష్యాపై దాడికి అమెరికా తయారుచేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను తాము ప్రయోగిస్తే యుద్ధ భూమిలో చాలా మార్పులు వస్తాయని, రష్యా భూభాగంలోని సైనిక స్థావరాలపై దాడిచేసే హక్కు కీవ్‌కు ఉందని ఆండ్రీ సైబిగా వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ ఎంత ఎక్కువగా దాడిచేస్తే ఇరుదేశాల మధ్య యుద్ధం అంత వేగంగా ముగుస్తుందని ఆండ్రీ అభిప్రాయం వ్యక్తంచేశారు.