ప్రముఖ నటుడు జయ ప్రకాష్ రెడ్డి కూమార్తె మల్లికా రెడ్డి నిర్మాతగా శ్రీ జయప్రకాష్ రెడ్డి ప్రొడక్షన్స్ (జెపి ప్రొడక్షన్స్) బ్యానర్ పై నరేన్ వనపర్తి కథానాయకుడిగా మల్లికార్జున్ రెడ్డి దర్శకత్వంలో రూపొందనున్న నూతన చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. ఈ చిత్రంలో పాయల్ గుప్తా కథానాయికగా నటిస్తోంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు బి గోపాల్ క్లాప్ కొట్టగా, నిర్మాత బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచాన్ చేశారు. డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకత్వం వహించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/Mallika-reddy_V_jpg-816x480-4g.jpg)
ఈ సందర్భంగా దర్శకుడు నేను దర్శకత్వం వహిస్తున్న రెండో చిత్రమిది. యువతరం మెచ్చే కథతో తెరకెక్కించబోతున్నాం. ఆగస్ట్ నుంచి షూటింగ్ మొదలుపెడతాం అన్నారు. తన తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టానని నిర్మాత మల్లికా రెడ్డి పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: శివ, నిర్మాణ సంస్థ: జేపీ ప్రొడక్షన్స్, నిర్మాత: మల్లికా రెడ్డి.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-287.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-280.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-285.jpg)