జూనియర్ ఎన్టీఆర్ ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్‌తో ఫుల్ బిజీగా మారిపోయాడు. ఇప్పటికే పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్న తారక్ తాజాగా మరో బ్రాండ్‌కు అంబాసిడర్‌గా మారాడు. పాపులర్ జ్యువెల్లర్ కంపెనీ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కు జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నట్టు ప్రకటిస్తూ, తారక్ స్టైలిష్ లుక్‌లో ఉన్న స్టిల్‌ను షేర్ చేసింది కంపెనీ. తారక్ కుర్తా పైజామాలో మెస్మరైజింగ్ గెటప్‌లో కనిపిస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు.


బ్రాండ్ అంబాసిడర్‌గా జూ.ఎన్‌టిఆర్ రెండో ఇన్నింగ్స్‌తో మలబార్ గోల్డ్ 30వ వార్షికోత్సవం జరుపుకోనుంది. జూనియర్ ఎన్‌టిఆర్ మాట్లాడుతూ మరోసారి మలబార్ గోల్డ్‌తో భాగస్వామ్యం వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కస్టమర్ల సంఖ్యను పెంచుకోవాలనే లక్షంలో భాగంగా సూపర్ స్టార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు మలాబార్ గ్రూప్ చైర్మన్ ఎంపి అహ్మద్ తెలిపారు.
