నార్నే నవీన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీప్రియా, అనంతిక సునీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం మ్యాడ్. కల్యాణ్ శంకర్ దర్శకుడు. హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మాతలు. ఈ సినిమా ట్రైలర్‌ని హైదరాబాద్‌లో జూనియర్ ఎన్టీయార్ విడుదల చేశారు. వినోదంతో నిండిన ట్రైలర్ తనకు ఎంతగానో నచ్చిందని చెప్పిన ఎన్టీఆర్, మూవీ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో సంగీత్ శోభన్ మాట్లాడుతూ ఒక హాస్యభరితమైన కథ ఉందని నాగ వంశీ నన్ను సంప్రదించారు. కేవలం ఐదు నిమిషాల కథలోనే కాలేజీ వైబ్, కామెడీ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. టాలీవుడ్‌లో ఇలాంటి కథ వచ్చి చాలా సంవత్సరాలైంది.ప్రేక్షకులను పిచ్చెక్కించే హాస్యం ఉన్నందున ఈ చిత్రానికి మ్యాడ్ అని పేరు పెట్టాము అని అన్నారు. రామ్ నితిన్ మాట్లాడుతూ ఒక ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ నుండి ఆఫర్ రావడం, స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే ఈ సినిమాకు ఓకే చేశానని చెప్పారు. గోపికా ఉద్యన్ మాట్లాడుతూ తెలుగులో మ్యాడ్ సినిమాతో అరంగేట్రం చేస్తున్నాను. సినిమాలో నేను రాధ అనే కీలక పాత్ర పోషించాను అని తెలిపారు. ఈనెల 6న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.