రిత్విక్, చిల్లికేశల హీరోగా నటిస్తున్న చిత్రం కళింగపట్నం జీవా. పి.నానిబాబు దర్శకుడు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను యువత నిర్మాత రాహుల్ యాదవ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర హీరో, నిర్మాత రిత్విక్ మాట్లాడుతూ వైవిధ్యమైన కథ ఇది. ఇందులో హీరోకు ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది. కొవిడ్ సమయంలో ఎన్నో కష్టాలకోర్చి ఈ సినిమా పూర్తి చేశాను. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందించే చిత్రమవుతుంది అన్నారు. లక్ష్య దర్శకుడు సంతోష్ మాట్లాడుతూ ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. బిందు భార్గవి, ఉమామహేశ్వరరావు, అంబటి శ్రీనివాస్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బన్నీ అండ్ నానాజీ, సంగీతం: శుభంకర్, కథ, నిర్మాత: రిత్విక్ చిల్లకేశల, దర్శకత్వం: పి.నానిబాబు.














