Namaste NRI

పోస్టర్ లాంచ్ తో వచ్చిన కలివి వనం

రఘుబాబు, నాగదుర్గ, సమ్మెట గాంధీ, విజయలక్ష్మీ, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్రనాథ్‌, శ్రీచరణ్‌, అశోక్‌ ప్రధాన పాత్రలు పోషించిన తెలంగాణ రూరల్‌ నేపథ్య చిత్రం కలివి వనం. రాజ్‌ నరేంద్ర దర్శకుడు. మల్లికార్జున్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి నిర్మాతలు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రమోషన్‌లో భాగంగా కొండగట్టు బృందావన్‌ రిసార్ట్‌లో ఈ సినిమా పోస్టర్‌ని మీడియావారి చేతుల మీదుగా విడుదల చేశారు.

వన సంరక్షణ అనే కాన్సెప్ట్‌ చుట్టూ ఈ కథ తిరుగుతుందని, తెలంగాణ జగిత్యాల జిల్లాలోని గుట్రాజుపల్లి ప్రాంతంలో సారంగాపూర్‌ అడవుల్లో చిత్రీకరణ జరిపామని, తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ‘బలగం’ మాదిరిగా ఈ సినిమా కూడా అఖండ విజయాన్ని అందుకుంటుందనే నమ్మకంతో ఉన్నామని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మదీన్‌ ఎస్కే.

Social Share Spread Message

Latest News