Namaste NRI

కల్కి 2898 ఏడీ కొత్త రిలీజ్ డేట్ వ‌చ్చేసింది.. ఎప్పుడో తెలుసా..?

ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం కల్కి 2898 ఏడీ. నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం. హీరోయిన్లుగా బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు దీపికా పదుకొణె, దిశా పటాని నటిస్తున్నారు. విశ్వ నటుడు కమల్‌ హాసన్‌తో పాటు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ  మూవీ రిలీజ్‌ డేట్‌ను మేకర్స్‌ ప్రకటించారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభాస్, దీపికా అమితాబ్‌ లపై ఓ కేజ్రీ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తుండగా,  వైజయంతి మూవీ నిర్మిస్తున్నది. పురాణాల్లోని కల్కి అవతారాన్ని స్ఫూర్తిగా తీసుకొని డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తున్నది.

దాదాపు రూ.600కోట్ల బడ్జెట్‌తో సినిమాను వైజయంతి మూవీస్‌ నిర్మిస్తున్నారు. భారతీయ సినిమా చరిత్రలోనే భారీ బ‌డ్జెట్ సినిమాల్లో కల్కి తెరకెక్కతున్నది. తెలుగుతో పాటు హిందీ భాష‌ల్లో ఏక‌కాలంలో ఈ మూవీని షూటింగ్‌ ను పూర్తి చేశారు. తమిళ్‌, మలయాళం, కన్నడంతో పాటు ఇంగ్లీష్‌లో డబ్‌ చేసి విడుదల చేయను న్నా రు. ఈ చిత్రంలో ప్రభాస్‌ భైరవ అనే పాత్రలో నటిస్తుండగా,  అశ్వత్థామగా అమితాబ్‌, కాళీగా క‌మ‌ల్‌హాస‌న్ నటిస్తున్నారు. కెరీయర్‌లోనే తొలిసారిగా కమల్‌ హాసన్‌ విలన్‌గా నటిస్తుండడం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events