నందమూరి కల్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ లవర్స్ కు కొత్త సినిమా అప్‌డేట్ అందించాడు. ఇప్పుడు కళ్యాణ్ రామ్, ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తన 21వ చిత్రానికి సైన్ చేశారు. కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా అధికారికంగా అనౌన్స్ చేశారు. కల్యాణ్‌రామ్ కొత్త ప్రాజెక్ట్ NKR21 (వర్కింగ్ టైటిల్). అలా ఎలా అనే ఫీల్ గుడ్ రొమ్-కామ్‌ని నిర్మించిన తర్వాత అశోక క్రియేషన్స్ ఈ భారీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తోంది. వారు కళ్యాణ్ రామ్ నందమూరి తారక రామారావు ఆర్ట్స్ (NTR ఆర్ట్స్) బ్యానర్‌తో కలిసి పని చేస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం 2 గా అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఈ చిత్రం ప్రముఖ తారాగణం, ప్రతిభావంతులైన సాంకేతిక బృందం పని చేస్తోంది. ప్రొడక్షన్, సాంకేతిక ప్రమాణాల పరంగా ఇది భారీగా ఉంటుంది.కళ్యాణ్ రామ్‌ని మునుపెన్నడూ చూడని యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో చూపించడానికి ప్రదీప్ చిలుకూరి ఆకట్టుకునే కథను రాశారు.

