
కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం మార్షల్. కల్యాణి ప్రియదర్శన్ కథానాయిక. ఈ చిత్రానికి తమిజా దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం సినిమాను ప్రారంభించడంతో పాటు రెగ్యులర్ షూటింగ్‌ను కూడా మొదలుపెట్టారు. అత్యున్నత సాంకేతిక, నిర్మాణ విలువలతో తెరకెక్కించబోతున్న యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ఇది. కార్తీ మునుపెన్నడూ చూడని కొత్త పాత్రలో కనిపిస్తారు అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రభు, లాల్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సత్యన్ సూర్యన్, సంగీతం: సాయి అభ్యంకర్, నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్. ప్రభు, రచన-దర్శకత్వం: తమిజా.
















