కమల్‌హాసన్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం థగ్‌లైఫ్ చెన్నైలో ప్రారంభమైంది. బుధవారం షూటింగ్ ప్రారంభమైనట్లు చిత్ర బృందం ఓ వీడియోను షేర్ చేసింది. ఈ పాన్ ఇండియా చిత్రంలో దుల్కర్ సల్మాన్, జయం రవి, గౌతం కార్తిక్, జోజు జార్జ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్ర లను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: రవి కె చంద్రన్, సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, నిర్మాణ సంస్థలు: రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, నిర్మాతలు: కమల్ హాసన్, మణిరత్నం, ఆర్.మహేంద్రన్, శివ అనంత్, రచన-దర్శకత్వం: మణిరత్నం.
దాదాపు 36 సంవత్సరాల విరామం తర్వాత ఈ లెజెండ్స్ ఇద్దరూ కలిసి పనిచేయడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన నాయకుడు (1987) క్లాసిక్ చిత్రంగా నిలిచిపోయింది. దీంతో థగ్ లైఫ్ సినిమా ప్రకటన రోజు నుంచే సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచింది.