Namaste NRI

కంగనారనౌత్‌ ఎమర్జెన్సీ లుక్‌ విడుదల

బాలీవుడ్ నటి కంగనారనౌత్‌  ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఎమర్జెన్సీ. ఈ చిత్రాన్ని కంగనా హోం బ్యాన‌ర్ మ‌ణి క‌ర్ణిక ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై రేణు పిట్టి, కంగ‌నార‌నౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  పొలిటికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఎమర్జెన్సీలో కంగ‌నార‌నౌత్ ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తోంది. ఇందిరా గాంధీ పాలనలో 1975 నుండి 1977 వరకు కొనసాగిన ఇండియన్ ఎమర్జెన్సీ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తు న్నారు. ఈ కాలంలో పౌరహక్కుల సస్పెన్షన్‌, ఇందిరా గాంధీ వ్యతిరేకుల అరెస్టుతోపాటు పలు కీలక పరిణామా లు చోటుచేసుకున్నాయని తెలిసిందే. అయితే చాలా రోజుల తర్వాత ఈ మూవీ విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్‌.

ఈ చిత్రాన్ని జూన్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు తెలియజేస్తూ, కొత్త లుక్‌ విడుదల చేసింది కంగనా టీం. తాజా పోస్టర్‌లో కంగనా రనౌత్‌ రాజసం ఉట్టిపడే లుక్‌లో ఏదో అంతర్మ థనంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎమ‌ర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నిలబ‌డ్డ ప్రముఖ రాజ‌కీయ వేత్త జ‌య‌ప్రకాశ్‌ నారాయ‌ణ్ (జేపీ) రోల్‌లో పాపులర్‌ బాలీవుడ్‌ ద‌ర్శకనిర్మాత అనుప‌మ్ ఖేర్ న‌టిస్తుండగా, శ్రేయాస్ తల్పడే, భూమికా చావ్లా ఇత‌ర న‌టీన‌టులు కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ కుమార్ మ్యూజిక్, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events