మంచు విష్ణు టైటిల్ రోల్‌ను పోషిస్తున్న చిత్రం కన్నప్ప. శ్రీకాళహస్తి స్థలపురాణం నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు సరసన ప్రీతి ముకుందన్ కథానాయికగా నటించనుంది. ఆమెను తమ టీంలోకి ఆహ్వానిస్తూ చిత్రబృందం ఓ ప్రకటన విడుదల చేసింది. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ చాలా మందిని ఆడిషన్స్ చేసి చివరకు ప్రీతి ముకుందన్‌ను ఖరారు చేశాం. ఆమెకిది తొలి చిత్రం. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ప్రీతి, తన భరతనాట్య ప్రతిభతో పాత్రకు ప్రాణం పోస్తుందన్న నమ్మకం ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది అన్నారు. కన్నప్ప చిత్రంలో మోహన్‌బాబు, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు భాగం కావడంతో ఈ సినిమాకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఏర్పడింది.
